/rtv/media/media_files/2024/12/22/jWrAWcnsw8fx04SlxRwB.jpg)
INDw vs WIw Photograph: (INDw vs WIw)
టీమిండియా మహిళల జట్టు ఫుల్ జోరుమీదుంది. క్రికెట్‌లో దుమ్ము దులిపేస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2-1 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. ఇక ఇవాళ మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది.
Also Read : సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌ని పొగిడిన పూనమ్ కౌర్!
తొలి మ్యాచ్ వెస్టిండీస్‌తో జరిగింది. వడోదరలో జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 211 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చిత్తుగా ఓటమిపాలు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 314 పరుగులు చేసింది. ఇక 315 లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు సగం ఓవర్లకే కుప్పకూలిపోయింది.
Also Read : సైబర్ నేరాల్లో రూ.297 కోట్లు పోగొట్టుకున్న బాధితులు: సీవీ ఆనంద్
కేవలం 26.2 ఓవర్లలోనే 103 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో ఫ్లెచర్ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక ఆమెదే టాప్ స్కోర్ కూడా. ఓపెనర్లుగా దిగిన మాథ్యూ్స్ (0), జోసెఫ్ (0)తో డకౌట్‌గా నిలిచారు. అలాగే టీమిండియా బౌలర్లలో రేణు ఠాకూర్ సింగ్ చెలరేగిపోయింది. 5 వికెట్లు పడగొట్టి దుమ్ము దులిపేసింది. అలాగే ప్రియా మిశ్రా 2 వికెట్లు, సాధు 1 వికెట్ తీసి అదరగొట్టేశారు.
Also Read : ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు!
ఎవరెంత స్కోర్ చేశారంటే?
తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 రన్స్ చేసింది. ఓపెనర్లుగా స్మృతి మంధాన, ప్రతీకా రావెల్ చెలరేగారు. స్మృతి 102 బంతుల్లో 91 పరుగులు చేసింది. ప్రతీకా 69 బంతుల్లో 40 పరుగులతో విజృంబించారు. తొలి వికెట్‌కు 110 రన్స్ పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ఇక ఫస్ట్ డౌన్‌లో వచ్చిన హర్లీన్ డియోల్ (44)తో అదరగొట్టేసింది. ఇలా ఒక్కో వికెట్ కోల్పోతు హర్మన్ ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), రోడ్రిగ్స్ (31), దీప్తి శర్మ (14*) దూకుడుగా ఆడారు. ఇక విండీస్ బౌలర్లలో జేమ్స్ 5 వికెట్లు పడగొట్టి అబ్బురపరచింది.
Also Read : రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం!