Mahesh Babu : మొదటిసారి మిస్ అవుతున్నా.. మహేష్ ఎమోషనల్ పోస్టు!

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.తన కుమారుడు గౌతమ్‌ పుట్టిన రోజు సందర్భంగా అందుబాటులో లేకపోవడంపై కాస్త ఎమోషనల్‌ అయ్యారు.

New Update
mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.తన కుమారుడు గౌతమ్‌ పుట్టిన రోజు సందర్భంగా అందుబాటులో లేకపోవడంపై కాస్త ఎమోషనల్‌ అయ్యారు. గతంలో తన కుమారుడితో దిగిన ఫొటోను మహేష్ షేర్ చేశారు.  19వ పుట్టిన రోజు జరుపుకుంటున్న తన కుమారుడికి మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నా ప్రేమ నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలి’’ అని విష్‌ చేశారు. రాజమౌళి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది గౌతమ్ పుట్టినరోజును మిస్ అవుతున్నానని, ఇది మొదటిసారి అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.  గౌతమ కు మహేష్ బాబు అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

గౌతమ్ 2006 ఆగస్టు 31న జన్మించారు. గౌతమ్ చిన్నతనంలోనే తన తండ్రి మహేష్ బాబు నటించిన '1 - నేనొక్కడినే' సినిమాలో నటించారు. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను పోషించారు. ఇది అతనికి అరంగేట్ర సినిమా.గౌతమ్ స్పోర్ట్స్‌లో చాలా యాక్టివ్. ముఖ్యంగా ఫుట్‌బాల్, స్విమ్మింగ్ వంటి క్రీడలంటే అతనికి చాలా ఆసక్తి. ఒకప్పుడు గౌతమ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొని పతకాలు సాధించారు.  గౌతమ్ చాలా ప్రశాంతమైన, తక్కువ మాట్లాడే వ్యక్తి అని మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయంలో గౌతమ్ తన తండ్రి మహేష్ బాబు పోలికలను కలిగి ఉన్నారని అభిమానులు కూడా భావిస్తారు.

Also Read: ఏనుగు, డ్రాగన్ కలిసి అమెరికాపై దండయాత్ర.. SCO సమ్మిట్‌లో కీలక పరిణామం

రాజమౌళి దర్శకత్వంలో

ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నారు. ‘#SSMB29’ (వర్కింగ్‌ టైటిల్‌)తో  సినిమా తెరకెక్కుతోంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూళ్ల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ను నైరోబి, టాంజానియాల్లో ప్లాన్‌ చేస్తు్న్నారు మేకర్స్. ఇది ఒక గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ సినిమా. ఇండియానా జోన్స్ తరహాలో అడవుల్లో సాగే సాహసాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని సమాచారం. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది భారతీయ సినిమాలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: విదేశీ విద్యార్థులపై ట్రంప్ భారీ బాంబు.. ఎఫ్ 1 వీసాపై ఇకపై అమెరికా వెళ్లడం కష్టమే!

#Gautham Krishna #telugu-cinema #tollywood #mahesh babu
Advertisment
తాజా కథనాలు