Tollywood : సంక్షోభంలో టాలీవుడ్‌.. రేపటి నుంచి షూటింగ్స్ బంద్!

తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిచిపోనున్నాయి.  వేతనాలు 30% పెంచితేనే షూటింగ్స్‌లో పాల్గొంటామని ఫెడరేషన్ వెల్లడించింది. పెంచిన వేతనాలు ఏరోజు ఆరోజు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

New Update
tollywood

తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిచిపోనున్నాయి.  వేతనాలు 30% పెంచితేనే షూటింగ్స్‌లో పాల్గొంటామని ఫెడరేషన్ వెల్లడించింది. పెంచిన వేతనాలు ఏరోజు ఆరోజు ఇవ్వాలని డిమాండ్ చేసింది.  ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు ఇది వర్తిస్తుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తమ సభ్యుల వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తోంది. 

గత మూడు సంవత్సరాలుగా వేతనాలు పెంచకపోవడం, పెరిగిన నిత్యావసరాల ధరలతో జీవనం కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ డిమాండ్‌ను అంగీకరించని నిర్మాతల సినిమాల షూటింగ్‌లకు ఆగస్టు 4 నుంచి హాజరుకాకూడదని ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ బంద్‌ కేవలం హైదరాబాద్‌లోని షూటింగ్‌లకు మాత్రమే కాకుండా, తెలుగు సినిమా షూటింగ్‌లు ఎక్కడ జరిగినా వర్తిస్తుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. 30 శాతం వేతనాలు పెంచుతామని, పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే చెల్లిస్తామని నిర్మాతలు రాతపూర్వకంగా వెల్లడించిన తర్వాతే కార్మికులు షూటింగ్‌లకు వెళ్తారని ఫెడరేషన్ స్పష్టం చేసింది. 

ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా షూటింగ్ లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.  ఫెడరేషన్ వేతనాల పెంపు కోసం చేపట్టిన ఈ బంద్‌తో ఇండస్ట్రీలో మళ్ళీ సంక్షోభం నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు షూటింగ్‌లు నిలిచిపోయే అవకాశం ఉంది. కాగా గతంలో  కొన్ని రోజుల క్రితం తెలుగు సినిమా నిర్మాతల మండలి కూడా ఓటీటీ విడుదల సమయం, నిర్మాణ వ్యయాల వంటి సమస్యలపై చర్చించడానికి షూటింగ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

తెలుగు ఫిలిం ఫెడరేషన్ లేఖలో పేర్కొన్న డిమాండ్స్ 

1. వేతనాలు పెంపు విషయం లో కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ లుగా సయ్యద్ హ్యూమయున్ గారిని, వీరశంకర్ గారిని నియమించడం జరిగినది.
2. రేపటి నుండి (తేది: 04-08-2025) 30% వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయించడమైనది.
3. రేపు ఉదయం అనగా తేది: 04-08-2025 సోమవారం నుండి 30% వేతనాలు ఇస్తామని, ప్రొడ్యూసర్ నుండి సంభందిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంభందిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్ లకు తెలియజేసిన తరువాత మాత్రమే విధులకు వెళ్లాలని నిర్ణయించడమైనది.
4. అప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సంబందించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకు గాని, వెబ్ సిరీస్ ల షూటింగ్ లకు గాని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుండి అనుమతి లేనిదే ఎటువంటి విధులకు యూనియన్/అసోసియేషన్ సభ్యులు హాజరు కాకూడదని నిర్ణయించడమైనది. ఈ రూల్స్ తెలుగు సినిమా ఎక్కడ జరిగినా వర్తించును. ఇతర బాషా చిత్రాలకు కూడా వర్తించును.

Advertisment
తాజా కథనాలు