Pawan Kalyan : కత్తితో పవన్ ఎంట్రీ .. ఎల్బీ స్టేడియంలో రచ్చ రచ్చ

హైదరాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఎల్బీ స్టేడియంలో జరగుతోన్న ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కత్తితో వీర లెవల్ లో ఎంట్రీ ఇచ్చారు. కత్తి తిప్పుతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.

New Update
pawan (1)

హైదరాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఎల్బీ స్టేడియంలో జరగుతోన్న ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కత్తితో వీర లెవల్ లో ఎంట్రీ ఇచ్చారు. కత్తి తిప్పుతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.  ఈ సందర్భంగా అభిమానులు   స్టేడియంలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పవనన్న అంటూ కేకలు వేస్తున్నారు. వర్షంలో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఈవెంట్ కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. తమన్ సంగీతం అందించారు. ఈ నెల 25వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

సుజీత్ నాకు పెద్ద ఫ్యాన్ 

డైరెక్టర్ సుజీత్ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...  సుజీత్ తనకు ఎంతో పెద్ద అభిమాని అని చెప్పుకొచ్చారు. సుజీత్ తనకు కథ ముక్కలు, ముక్కలుగా చెప్పిన డైరెక్షన్ లో అదరగొట్టాడని తెలిపారు. థమన్ ఈ సినిమాకు మరో హీరో అని తెలిపారు. ఈ సినిమాకు తాను పడిపోయానని డిప్యూటీ సీఎం అన్న విషయాన్ని కూడా మరిచిపోయానని పవన్ తెలిపారు. ఖుషి సినిమా తరువాత తన అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని తెలిసిందన్నారు. ఈ సినిమాను కూడా తాను ఎంతో ప్రేమించానని పవన్ తెలిపారు. సుజీత్ టీమ్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు,ఇలాంటి టీమ్ ఉంటే తాను రాజకీయాల్లోకి వచ్చేవాన్ని  కాదన్నారు పవన్. తాను సినిమాలను వదిలిన తనను మాత్రం అభిమానులు వదల్లేదని చెప్పుకొచ్చారు. 

#telugu-cinema #tollywood #OG Movie #Pawan Kalyan
Advertisment
తాజా కథనాలు