Rajamouli : హనుమంతుడిపై రాజమౌళి సంచలన కామెంట్స్..  భక్తులు ఫైర్!

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. హనుమంతుడు రాజమౌళి వెనుక ఉండి ఈ సినిమా తీయించారని అన్నారు.

New Update
rajamouli

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. హనుమంతుడు రాజమౌళి వెనుక ఉండి ఈ సినిమా తీయించారని అన్నారు. అయితే  వారణాసి గ్లింప్స్ రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో నిరాశకు లోనైన రాజమౌళి కీలక కామెంట్స్ చేశారు. 

నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు.. హనుమంతుడు వెనుకాల ఉంటాడని..  మా నాన్న చెప్పారు. ఇలా అంటే వెంటనే కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు మనోభావాలను దెబ్బతీశాయని హనుమాన్ భక్తులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ టీమ్‌ వైఫల్యాన్ని దేవుడికి ఆపాదించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

దేవుడిని ఎలా నిందిస్తారు? 

సాంకేతిక లోపానికి దేవుడిని ఎలా నిందిస్తారని నిలదీస్తున్నారు. దేవుడిని నమ్మనంటూనే, ఆటంకాలు ఎదురైనప్పుడు హనుమంతుడిపై నిందలు మోపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విజయం సాధిస్తే అది మీ క్రెడిట్, విఫలమైతే దేవుడి తప్పా అంటూ రాజమౌళి ద్వంద్వ వైఖరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమతో పాటు భక్తుల సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రాజమౌళి దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి మూవీ గ్లింప్స్‌ను నిన్న రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌ ప్రపంచ సినిమా స్థాయి విజువల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. గ్లింప్స్‌లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భారీ సెట్టింగులు హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. త్రీడీలో సృష్టించిన ఈ విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. గ్లింప్స్‌లో ఎక్కడా డైలాగులు లేకపోయినా, కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని భావోద్వేగాలను, ఉత్కంఠను అద్భుతంగా ఎలివేట్ చేసింది.గ్లింప్స్ చివర్లో మహేశ్ బాబు ఒక నందిపై కూర్చొని, చేతిలో త్రిశూలం పట్టుకొని రౌద్రంగా నిలబడిన షాట్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది.

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాలోని కుంభ పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక చోప్రాఈ చిత్రంలో మందాకిని అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఈవెంట్‌లో తెలిపారు. ఈ గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయాయి.

Advertisment
తాజా కథనాలు