HHVM Updates : అబ్బా సాయిరాం.. హరిహర వీరమల్లు నుంచి ఆ సీన్లు లేపేశారు!

అయితే సినిమాలోని VFX షాట్స్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చిత్ర యూనిట్ తాజాగా ఈ విషయంలో మార్పులు చేసింది. అభిమానుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్న  చిత్ర బృందం అలాంటి కొన్ని సన్నివేశాలను తొలగించింది.

New Update
harihara-veeramallu

వవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం హరి హర వీరమల్లు.  ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్త  దర్శకత్వంలో ఈ  మూవీ తెరకెక్కింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.  ఐదేళ్లుగా రూపొందిన ఈ చిత్రం ఫైనల్ గా భారీ అంచనాల నడుమ 2025 జులై 24వతేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే సినిమాలోని VFX షాట్స్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చిత్ర యూనిట్ తాజాగా ఈ విషయంలో మార్పులు చేసింది. అభిమానుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్న  చిత్ర బృందం అలాంటి కొన్ని సన్నివేశాలను తొలగించింది.  హీరో, అతడి అనుచరులు కొండ అంచున గుర్రాలపై స్వారీ చేసే సీన్‌ను తగ్గించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ముఖం వికృతంగా కనిపించిన ఫ్లాగ్ సీన్ ను పూర్తిగా తొలగించారు.  పవన్ కళ్యాణ్ బాణం వేసే ఒక యాక్షన్ సన్నివేశంలో కూడా చిన్నపాటి మార్పులు చేశారు. మాట వినాలి పాట ముందు వచ్చే రాతిబండ సన్నివేశాన్ని మరింత క్రిస్ప్ గా మార్చారు. దీని వల్ల సినిమా దాదాపుగా 15 నిమిషాల వరకు నిడివి తగ్గింది. 

 హరి హర వీరమల్లు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో, సినిమాలోని వీఎఫ్ఎక్స్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద బడ్జెట్ సినిమా అయినప్పటికీ వీఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉందని, అది సినిమాను చూసే అనుభూతిని దెబ్బతీసిందని విమర్శించారు. ఈ విమర్శలను దృష్టిలో పెట్టుకుని, సినిమాను తిరిగి ఎడిట్ చేసి, మెరుగైన వెర్షన్ ను ప్రదర్శించాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అయితే, ఈ మార్పులు బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాకు ఎంతవరకు సహాయపడతాయో అనేది మాత్రం వేచి చూడాలి.

వసూళ్లు తగ్గుముఖం

హరి హర వీరమల్లు గురువారం (జులై 24) భారీ వసూళ్లతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రీమియర్ షోలతో కలిపి (బుధవారం, జులై 23), జులై 27 నాటికి సినిమా మొత్తం రూ. 65.36 కోట్ల (కొన్ని నివేదికల ప్రకారం రూ. 64.75 కోట్లు) వసూళ్లను సాధించింది. శుక్రవారం (రెండవ రోజు) వసూళ్లు 76.98% పడిపోయి రూ. 8 కోట్లు మాత్రమే వచ్చాయి. శనివారం (మూడవ రోజు) కాస్త మెరుగుపడి రూ. 9.25 కోట్లు లేదా రూ. 9.86 కోట్లు వసూలు చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ లోని రాజానగరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో 9, 10, ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం జూలై 27న సినిమాకు ఉచిత ప్రదర్శనలు నిర్వహించారు. 

Advertisment
తాజా కథనాలు