BIG BREAKING: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఔట్
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికబద్ధంగా రూపొందించారని టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు.
టీటీడీలో ఉద్యోగాల భర్తీపై చైర్మన్ బీఆర్ నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతీ ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
విషాదంలో మంత్రుల వినోదం అంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందుల్లో మంత్రులు మునిగిపోయారంటూ ఓ ఫొటోను తన X ఖాతాలో షేర్ చేశారు.
రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కు రూ.9,400 కోట్లను కేటాయించారు. విత్తన రాయితీ, వడ్డీలేని రుణాలతో పాటు కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసు బాధితురాలి పేరును పేర్కొనడంతో ఆయనపై కేసు నమోదైంది.
మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సలహాలు తమకు అవసరం లేదన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.
కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరుగుతున్న రిస్క్యూ ఆపరేషన్ ను ఆయన పరిశీలించారు.
నిర్మాత కేదర్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా ఉందని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేదార్, కాళేశ్వరం కేసుల న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగ మూర్తి హత్యలపై అనుమనాలు వ్యక్తం చేశారు. ఈ కేసులపై విచారణకు KTR ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.