Gorentla Madhav: గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు.. హైటెన్షన్!

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసు బాధితురాలి పేరును పేర్కొనడంతో ఆయనపై కేసు నమోదైంది.

New Update
Gorentla Madhav arrest

Gorentla Madhav arrest

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorentla Madhav) కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు (Vijayawada Cyber Crime Police) షాక్ ఇచ్చారు. అనంతపురంలోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. మార్చ్ 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నవంబర్ రెండు 2024న గోరెంట్ల మాధవ్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలి పేరును గోరంట్ల మాధవ్ ప్రస్తావించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 72, 79 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read :  ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు... పాకిస్తాన్ చెత్త రికార్డు!

ఈ విషయమై గోరంట్ల మాధవ్ స్పందించారు. కూటమి ప్రభుత్వం కావాలని తనపై కేసు పెట్టిందన ఆరోపించారు. చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారో గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడుతానన్నారు. తన లీగల్ అడ్వైజర్ తో కలిసి విచారణకు వెళ్తానన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. ఏపీలో అంతర్యుద్ధం రాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదన్నారు. 

Also Read :  గోవాలో పర్యాటకులు సంఖ్య ఎందుకు తగ్గిందంటే ?.. స్థానిక ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Also Read :  మరిన్ని చిక్కుల్లో అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Also Read :  SLBC టన్నెల్ కూలడానికి ప్రధాన కారణం అదే.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు!

నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

ఇప్పటికే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు విజయవాడ జైలులో ఉన్నారు. మరో వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆయనను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజాగా గోరెంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో వైసీపీ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నెక్ట్స్ అరెస్ట్ ఎవరిది? అన్న అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు