SLBC టన్నెల్ కూలడానికి ప్రధాన కారణం అదే.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు!

మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సలహాలు తమకు అవసరం లేదన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.

New Update
Uttam Kumar Reddy SLBC

Uttam Kumar Reddy SLBC

ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడడానికి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎక్స్పర్ట్స్ తో సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. SLBC టన్నెల్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. కూలిపోయిన మట్టిని త్వరగా త్వరగా తీసివేస్తామన్నారు. మూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుందని ప్రకటించారు. రెండు మూడు నెలల్లో ఈ టన్నెల్ ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించి టన్నెల్ ను కంప్లీట్ చేస్తామన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. వాటర్ డివాటరింగ్ కు కనీసం విద్యుత్ ప్రొవైడ్ చేయలేని చేతకానితనం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు.

హరీష్ సలహాలు అవసరం లేదు..

హరీష్ రావు సలహాలు తమకు అవసరం లేదన్నారు. మీ కన్నా పెద్ద ఎక్స్పర్ట్స్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో  పనిచేస్తున్నారన్నారు. తెలంగాణలో జేబులు నింపుకోవడానికి ఇరిగేషన్ శాఖను నాశనం చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. దేవాదుల, సీతారాం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈరోజు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలు పూర్తిగా అబద్ధమన్నారు. SLBC గ్రావిటీ ద్వారా 30 టీఎంసీల వాటర్ వస్తుంటే కూడా పనులు వదిలిపెట్టి పోయారన్నారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి హరీష్ రావుకు సిగ్గుండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే లోపలికి అనుమతించకుండా నియంత పాలన చేశారన్నారు. రూ.1.81 లక్ష కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిరుపయోగంగా మారాయన్నారు. గతంలో శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రం దగ్గర ఇలాంటి ఘటన జరిగితే లోపలికి ఎవరిని అనుమతించలేదని గుర్తు చేశారు.

ఆరోజు ఆ ఘటనను చూడడానికి బయలుదేరిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని మధ్యలోనే అరెస్టు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆరుగురు చనిపోతే దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం జవాబు చెప్పలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పంపు కూలి ఆరుగురు చనిపోతే కనీసం క్లారిటీ ఇవ్వలేదన్నారు. 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ దగ్గర చనిపోతే పట్టించుకున్న నాథుడే లేడన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే వారి కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు