AP Budget 2025: ఏపీ బడ్జెట్లో రైతులపై వరాల జల్లు.. 20 శుభవార్తలు.. లిస్ట్ ఇదే!

రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కు రూ.9,400 కోట్లను కేటాయించారు. విత్తన రాయితీ, వడ్డీలేని రుణాలతో పాటు కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
AP Agriculture Budget 2025

AP Agriculture Budget 2025

ఈ రోజు రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. దీంతో అన్నదాతలకు భారీ శుభవార్త చెప్పారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకం అమలుకు రూ.9,400 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం 12 వేల కోట్లు, వడ్డీ లేని రుణాలకు రూ.250 కోట్లు, విత్తన రాయితీకి రూ.240 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు కేటాయించారు. కేటాయింపుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు..

  1. విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు
  2. ఎరువుల బఫర్‌ స్టాక్‌ నిర్వహణకు రూ.40 కోట్లు
  3. ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78 కోట్లు
  4. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు
  5. రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు
  6. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకం అమలుకు రూ.9,400 కోట్లు
  7. ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు
  8. వ్యవసాయ శాఖకు రూ.12,401.58 కోట్లు
  9. ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు
  10. పట్టుపరిశ్రమకు రూ.96.22 కోట్లు
  11. సహకార శాఖకు రూ.239.85 కోట్లు
  12. పశుసంవర్ధక శాఖకు రూ.1,112.07 కోట్లు
  13. మత్స్య రంగానికి రూ.540.19 కోట్లు
  14. ఎన్జీ రంగా వర్సిటీకి రూ.507.01 కోట్లు
  15. వైఎస్సార్‌ వర్సిటీకి రూ.98.21 కోట్లు
  16. ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి రూ.154.57 కోట్లు
  17. ఏపీ ఫిషరీస్‌ వర్సిటీకి రూ.38 కోట్లు
  18. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకానికి రూ.12,773.25 కోట్లు
  19. ఉపాధి హామీకి రూ.6,026.87 కోట్లు
  20. ఎన్టీఆర్‌ జలసిరికి రూ.50 కోట్లు
  21. నీటివనరుల శాఖకు రూ.12,903.41 కోట్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు