GV Reddy: చంద్రబాబు గ్రేట్.. బడ్జెట్ సూపర్.. రాజీనామా తర్వాత జీవీ రెడ్డి సంచలన ట్వీట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికబద్ధంగా రూపొందించారని టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు.

New Update
GV Reddy Chandrababu

GV Reddy Chandrababu

ఇటీవల ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీకి రాజీనామా చేసిన జీవీ రెడ్డి కొద్ది సేపటి క్రితం తన X ఖాతాలో సంచలన పోస్ట్ చేశారు. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూపొందించారు. రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా ప్రవేశపెట్టారని కొనియాడారు. తాను వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు.

చంద్రబాబుకు రుణపడి ఉంటా..

తక్కువ కాలంలోనే టీడీపీ లోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత  అని పోస్ట్ లో పేర్కొన్నారు.

Advertisment