/rtv/media/media_files/2025/03/01/L16ben3eikqeSuxMKw8k.jpg)
theenmar mallanna suspension
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ పై తీన్మార్ మల్లన్న బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదే నెల 12లోగా ఆ నోటీసులకు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : మంచిని మైకులో చెప్పాలి..చెడును చెవిలో చెప్పాలి..కానీ మీరు... సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బిగ్ బ్రేకింగ్ న్యూస్
— RTV (@RTVnewsnetwork) March 1, 2025
తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ.@INCTelangana @TeenmarMallanna #TelanganaCongress #teenmarmallanna #suspend #RTV pic.twitter.com/msKTatzrVR
అయితే.. తీన్మార్ మల్లన్న ఆ నోటీసులకు స్పందించలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన క్రమశిక్షణ కమిటీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిన్న రాష్ట్రానికి తొలిసారిగా వచ్చారు. నేతలతో సమావేశం అయ్యారు. ఆమెకు పలువురు నేతలు తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసిటనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు మల్లన్నను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: New Ration Cards: షాకింగ్ న్యూస్.. రేషన్ కార్డుల పంపిణీ వాయిదా!
ఇటీవల కులగణనతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఓ వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. పార్టీ ముఖ్య నేతలపై సైతం వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు మల్లన్న. దీంతో మల్లన్నపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు రావడంతో గత నెల 5న క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సమాధానం ఇచ్చేది లేదని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
టీపీసీసీ చీఫ్ రియాక్షన్..
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇది తన హెచ్చరిక అని స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.