🔴 Live News: రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ తరఫున దాసోజు శ్రవణ్ నామినేషన్లు వేశారు.
గ్రూప్ 1 ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్దీసేపటి క్రితమే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గానూ నిర్వహించిన ఈ పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను వెల్లడించింది.
ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి SVSN వర్మ స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానన్నారు. ఈ రోజు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
దుబాయ్ వేదికగా IND - NZ జట్ల మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. వారంలో మరో 198 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమంటూ కోటంరెడ్డిని ప్రశంసిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది.