TS: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్...24 షీట్స్ బుక్ లెట్..
తెలంగాణలో ఈరోజు నుంచే టెన్త్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5.09 లక్షల మంది ఈసారి ఎగ్జామ్స్ రాయనున్నారు.
తెలంగాణలో ఈరోజు నుంచే టెన్త్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5.09 లక్షల మంది ఈసారి ఎగ్జామ్స్ రాయనున్నారు.
తిరుమల దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందన్నారు సీఎం. మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు
బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెట్టింగ్ యాప్ కేసు డొంక కదులుతోంది. ఇప్పటికే 25 మందిపై కేసులు నమోదవగా తాజాగా న్యూస్ యాంకర్, యూట్యూబర్ శివజ్యోతి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు వీడియోలు బయటకొచ్చాయి. దీంతో 'సజ్జనార్ సర్ ఆమెను అరెస్ట్ చేయండి' అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో ఉన్న విభేదాలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.మందకృష్ణతో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ ఆయన తనకంటే ఎక్కువ ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డిని నమ్ముతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలో కీలక పరిణామలు చోటుచేసుకున్నాయి. 2020 మార్చిలో నార్సింగిలో సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. సైఫాబాద్ పీఎస్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40 శాతం కమిషన్ పాలన అనిపిస్తుందని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై నిలదీశారు.
నేడు తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 3 లక్షల కోట్లకు పైనే ఉండబోతుందని తెలుస్తోంది. 6 గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.