తిరుమల దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందన్నారు సీఎం. మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. ప్రతిసారి దర్శనాలకు ఎమ్మెల్యేలను లెటర్లు అడుక్కోవడం ఎందుకున్నారు. భద్రాచలంలో రాములవారు, యాదగిరిలో లక్ష్మీనరసింహా స్వామి, రామప్పలో శివాలయాలు లేవా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న మన ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని సీఎం ప్రశ్నించారు. తిరుమల దర్శనం గురించి గత కొంత కాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో సీఎం ఆ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ ‘బిల్డ్ నౌ పోర్టల్’ను ప్రారంభించారు. అంతేకాకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు అందజేశారు.
Also read : నేను చేసింది తప్పే.. బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన వీడియో!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుమలలో సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ ఇటీవల చాలా ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే సిఫారసు లెటర్ ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే, ఎంపీలు బహిరంగాగానే వాపోయారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలంటూ పలువురి నేతల నుంచి విజ్ఞప్తులు కూడా అందాయి.
Also read : చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ !
అడుక్కోవడం ఎందుకు.. తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
తిరుమల దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందన్నారు సీఎం. మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు