/rtv/media/media_files/2025/03/11/rlnGkI323QJAXFLGnIuN.webp)
Telangana Assembly
BIG BREAKING: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం తెలిపింది. సోమవారం ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కాగి ఇవాల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంపూర్ణ మద్ధతు ఇస్తామని బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
దేశంలోనే తొలిసారి...
ఈ సందర్భంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిదని చెప్పారు. ‘బాబూ జగ్జీవన్‌రామ్‌కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అప్పగించి గౌరవించింది. దేశంలోనే తొలిసారి ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిని చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది. దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. 2004లో ఉషా మెహ్రా కమిటీ వేసి సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇన్నాళ్లకు నేను సీఎంగా ఉండగానే సమస్య పరిష్కారం కావటం సంతోషకరంగ ఉంది' అని అన్నారు.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
అలాగే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని గుర్తు చేశారు. ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించామని, మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు షమీమ్ అక్తర్ కమిషన్ నియమించినట్లు తెలిపారు. కమిషన్.. ప్రజల నుంచి 8,681 ప్రతిపాదనలు స్వీకరించిందని.. కమిషన్ నివేదికను ఏ మాత్రం మార్చకుండా ఆమోదించామని చెప్పారు. 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా కమిషన్ విభజించింది. 59 కులాలు ఇప్పటివరకు పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫార్సులు చేసిందన్నారు.
Also Read: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!