బండి సంజయ్కి బిగ్ రిలీఫ్.. ఆ కేసును కొట్టేసిన హైకోర్టు!

బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.  గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
Bandi Sanjay Comments on Delhi Election Results

Bandi Sanjay Comments on Delhi Election Results

కరీంనగర్ బీజేపీ ఎంపీ,  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.  గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే ఈ కేసు కొట్టివేయాలంటూ బండి సంజయ్ హైకోర్టులో ఫిటిషన్ వేశారు.  దీనిపై ఇవాళ విచారణ జరగగా.. ఎలాంటి ఆధారాలు లేవని బండి సంజయ్ తరుపు న్యాయవాది వాదించారు.  ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  

కేటీఆర్, సీఎం రేవంత్ లకు ఊరట...  

2020 మార్చిలో నార్సింగిలో సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు నిన్న కొట్టివేసింది.  జన్వాడలో డ్రోన్‌ ఎగురవేశారని రేవంత్‌రెడ్డితో పాటుగా పలువురిపై కేసు నమోదైంది.  2020మార్చిలో రేవంత్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు నార్సింగి పోలీసులు. 2020 మార్చిలో ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.  జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదన్నారు రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది.  రేవంత్‌రెడ్డిపై తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటూ న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.  

అలాగే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసును సైతం హైకోర్టు కొట్టివేసింది.  సీఎం రేవంత్‌రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్‌పై సైఫాబాద్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  ఎంపీ అనిల్‌ కుమార్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సైఫాబాద్‌ పోలీసులు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు కేటీఆర్‌.  సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పీపీ వాదించగా..  రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.  ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  

Also read :  హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు

Advertisment
తాజా కథనాలు