MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్నికలు ఎప్పుడంటే...
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ నెల 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.