దొంగలతో కానిస్టేబుల్ దోస్తీ.. చివరికి వారిచేతిలోనే హతం, కారణం ఇదే!
ఈజీ మనీ కోసం దొంగలతో జట్టుకట్టి ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీసు, డబ్బు పంపకాల్లో తేడా వచ్చి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సరూర్‌నగర్ పరిధిలో జరిగింది.
ఈజీ మనీ కోసం దొంగలతో జట్టుకట్టి ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీసు, డబ్బు పంపకాల్లో తేడా వచ్చి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సరూర్‌నగర్ పరిధిలో జరిగింది.
మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది.
నిజామాబాద్ లో నివాసముంటున్న ఉప్పలించి వేణు కుటుంబం వడ్దీ వ్యాపారుల నుంచి రూ.3లక్షలు అప్పు తీసుకుంది. ఆపై కూతురికి పెళ్లి సంబంధం ఖాయం అయింది. అదే సమయంలో మొత్తం డబ్బు చెల్లించాల వ్యాపారులు వేధించడంతో ఆ కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్యాచార ఘటనపై హరీష్ రావు స్పందించారు. హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు.
దసరా పండుగ వేళ కామారెడ్డి జిల్లా నందివాడలో తీవ్ర విషాదం జరిగింది. చిట్టపు శ్రీనివాస్ తన ఇద్దరు కుమారులు విగ్నేష్, అనిరుధ్‌లను రాత్రి సమయంలో బావిలో తోసి చంపేశాడు. ఆపై తాను కూడా బావిలో పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న జితేందర్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనికి మద్యం తాగించి.. దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన రామంతపూర్‌లోని కేసీఆర్‌నగర్‌లో కలకలం రేపింది. జగన్ చారి మరణంపై ఉప్పల్ పోలీసులకు అనుమానాస్పద మృతిగా పద్మావతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా తర్వాత ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక డంప్ ఉన్నట్టు సమాచారం. దీన్ని తెలంగాణకు చెందిన కొందరు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ కనీసం వంద నుంచి 120 లారీల్లో ఇసుకను మన రాష్ట్రంలోకి తరలిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్ చేసి హత్యలకు పాల్పడుతున్న కిష్టప్ప అనే సైకో కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు మహిళలను హత్యచేసి మూటగట్టి పడేసినట్లు సైకో కిష్టప్ప అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.