దొంగలతో కానిస్టేబుల్ దోస్తీ.. చివరికి వారిచేతిలోనే హతం, కారణం ఇదే! ఈజీ మనీ కోసం దొంగలతో జట్టుకట్టి ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీసు, డబ్బు పంపకాల్లో తేడా వచ్చి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సరూర్‌నగర్ పరిధిలో జరిగింది. By Seetha Ram 12 Nov 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి ఈజీ మనీకి అలవాటు పడిన ఓ పోలీసు తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవడమే కాకుండా.. తన ప్రాణాన్ని సైతం కోల్పోయాడు. స్మార్ట్ ఫోన్ దొంగతనాలు చేసేవారితో జతకట్టాడు. కొంతకాలం బాగానే గడిచినా.. డబ్బు పంపకాల్లో విభేదాలు రావడంతో వారి చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సరూర్ నగర్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు! నేర విభాగంలో పట్టు ఉమ్మడి రాష్ట్రంలో 2010లో ఏపీకి చెందిన ఈశ్వర్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు. ఎస్సార్ నగర్, బేగం పేట, చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ లతో పాటు టాస్క్ పోర్స్ విభాగంలోనూ విధులు నిర్వర్తించాడు. మొత్తం క్రైమ్ విభాగంలోనే పనిచేయడంతో నేర వ్యవస్థపై బాగా పట్టు సాధించాడు. దీంతో మొబైల్స్ దొంగతనం చేసేవారితో జట్టుకట్టాడు. ఎక్కెడెక్కడ ఫోన్లు పోయాయో.. వారి ఈఎంఐ నెంబర్ల ద్వారా కనుక్కునేవాడు. Also Read: Vistara: ముగిసిన విస్తారా కథ..ఈరోజు నుంచి ఎయిర్ ఇండియాలో విలీనం వెంటనే అక్కడికి వెళ్లి ఆ ఫోన్ ని రికవరీ చేసుకుని బయట అమ్ముకునే వారు. అలా డబ్బుకు అలవాటు పడ్డాడు. తరచూ ఇలానే చేశాడు. అయితే అక్కడితో ఆగకుండా ఈసారి మరో ప్లాన్ వేశాడు. డబ్బు సరిపోవడం లేదని.. స్నాచర్ లతో ఈశ్వర్ జతకట్టాడు. ఏకంగా వివిధ రాష్ట్రాల్లో స్నాచర్ ముఠాలను ఏర్పాటు చేయించసాగాడు. ఈ విషయం తెలిసి నల్లగొండ పోలీసులు రెండేళ్ల క్రితం ఈశ్వర్ ను అరెస్టు చేశారు. Also Read: నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ బ్యాడ్ టైం స్టార్ట్ అంతేకాకుండా అతడిని సర్వీసు నుంచి తొలగించారు. ఇక అప్పటి నుంచి ఈశ్వర్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇటీవల దొంగల ముఠాలతో ఈశ్వర్ కు విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. తనకు తెలియకుండా, తనకు కమీషన్ ఇవ్వకుండా ఇతరులెవరూ దొంగతనాలు చేయకూడదని ఈశ్వర్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తయితే గత కొద్ది రోజులుగా కొండాపూర్ హఫీజ్ పూటకు చెందిన శంకర్ తో, ఈశ్వర్ కు వివాదం నడుస్తోంది. ఇందులో భాగంగానే చర్చించేందుకు ఈశ్వర్ బంధువైన విజయ్, రంజిత్, రామస్వామిలు వారిద్దిరికి మీటింగ్ ఏర్పాటు చేశారు. Also Read: వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ ఓ బార్ లో మీట్ అయ్యారు. అక్కడ కూడా వీరి మీటింగ్ సక్సెస్ కాలేదు. దీంతో అక్కడ నుంచి బటయకొచ్చేశారు. బయట ఈశ్వర్, శంకర్ కు మరోసారి గొడవ జరిగింది. దీంతో శంకర్ తన కారుతో ఈశ్వర్ ను ఢీకొట్టాడు. రక్త శ్రావంతో ఈశ్వర్ కింద పడిపోగ మరోసారి కారుతో అతడిపై ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం స్థానికులు ఈశ్వర్ ను హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ 9 రోజుల క్రితం మరణించాడు. #Ex Constable #telangana-crime #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి