Telangana Crime: ప్రియురాలి ఇంట్లోనే వ్యక్తి బలవన్మరణం..ఎందుకంటే?

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన రామంతపూర్‌లోని కేసీఆర్‌నగర్‌లో కలకలం రేపింది. జగన్ చారి మరణంపై ఉప్పల్ పోలీసులకు అనుమానాస్పద మృతిగా పద్మావతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

New Update
Telangana Crime: ప్రియురాలి ఇంట్లోనే వ్యక్తి బలవన్మరణం..ఎందుకంటే?

Telangana Crime: హైదరాబాద్‌ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్‌లోని కేసీఆర్‌నగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి భువనేశ్వరి ఇంట్లో ప్రియుడు జగన్‌చారి (52) అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. 30 సంవత్సరాల క్రితం పద్మావతి అనే మహిళతో జగన్ చారికి వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పటేల్‌నగర్‌లో నివాసముండే జగన్‌చారి కార్పెంటర్ పనిచేస్తుంటాడు. ఐదు సంవత్సరాల నుంచి భువనేశ్వరి అనే మహిళతో జగన్ చారికి వివాహేతర సంబంధం ఉంది.

ప్రియురాలి ఇంట్లోనే దారుణం:

భువనేశ్వరి కేసీఆర్ నగర్‌లో నివాసం ఉంటుంది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె నివాసంలోనే చారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు రోజు ఇంటికి వచ్చిన భర్త వీపు, చెంపలపై గాయాలు ఉండటంతో భార్య పద్మావతి అడిగింది. అయినా భర్త నోరు మెదపలేదు. మరుసటి రోజు ప్రియురాలి ఇంటికి వెళ్లి ఉరేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యులకు రాజు అనే వ్యక్తి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. పటేల్‌నగర్ నుంచి పద్మావతి తన బంధువులను తీసుకొని కేసీఆర్‌నగర్‌లోని భువనేశ్వర్ ఇంటికి వెళ్లింది. జగన్ చారి మరణంపై ఉప్పల్ పోలీసులకు అనుమానాస్పద మృతిగా పద్మావతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో ఇది తింటే వారంలోనే రక్తం పడుతుంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు