ఛీ ఛీ.. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఫిజిక్స్ టీచర్ బాగోతం బట్టబయలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ రావు బాగోతం బయటపడింది. స్పెషల్ క్లాస్ పేర్లతో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై మహిళ టీచర్ ప్రశ్నించడంతో ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో మహిళా టీజర్ ఎంఈవోకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు. By Seetha Ram 12 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి రాజేంద్రనగర్‌లో మరో కీచక టీచర్ బాగోతం బట్టబయలైంది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన టీచర్.. కామంతో కళ్లు మూసుకుపోయి వికృత ఆనందం పొందాడు. ప్రశ్నించిన ప్రధానోపాద్యాయురాలితో గొడవ పడ్డాడు. తానే తోపంటూ విర్రవీగాడు. వెంటనే ఎంఈవోకు కంప్లీట్ చేయగా.. ఆయన స్పందించి సరైన గుణపాఠం చెప్పాడు. పూర్తివివరాల్లోకి వెళితే.. Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! ఫిజిక్స్ టీచర్ బాగోతం బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో దివ్యాంగుడైన ఫిజిక్స్ టీచర్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్పెషల్ క్లాస్ పేర్లతో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పదో తరగతి బాలికలకు మాత్రమే పాఠాలు చెబుతానంటూ వికృత ఆనందం పొందాడు. అదే సమయంలో విద్యార్థినిల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. Also Read: BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు సాయంత్రం స్కూల్ ముగిసినప్పటికి బాలికలను ఇంటికి కూడా పంపించేవాడు కాదు. ఇక అతడి లైంగిక వేధింపులతో భయబ్రాంతులకు గురైన విద్యార్థులు.. తమపై జరుగుతున్న లైంగిక దాడిని ప్రధానోపాధ్యాయురాలికి చెప్పుకున్నారు. ఆమె వెంటనే వేణుగోపాల్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేయగా వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో చేసేదేమి లేక ప్రధానోపాధ్యాయురాలు పాఠశాల బయట నిరసన వ్యక్తం చేశారు. Also Read: Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పాఠశాల వద్దకు చేరుకుని ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం ఎంఈవోకు ఫిర్యదు చేశారు. దీంతోపాటు ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విషయం తెలుసుకుని వెంటనే పాఠశాలకు చేరుకున్నాడు. ఆపై వేణుగోపాల్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎంఈవో శంకర్ నాయక్.. వేణుగోపాల్ రావును విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటిదే ఇటీవల మరో ఘటన కోచింగ్ కోసం వచ్చిన ఓ విద్యార్థిని ఇద్దరు టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసిన దారుణ ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫతేపుర్‌కి చెందిన ఓ విద్యార్థి వైద్య విద్య ప్రవేశానికి నీట్ కోచింగ్ కాన్పూర్‌లో తీసుకుంటుంది. 2022 డిసెంబర్‌లో ఆమె ఆ కోచింగ్ సెంటర్‌లో చేరగా.. జనవరి 1న న్యూఇయర్ పార్టీ వేడుకలు అని పిలిచారు. చాలా మంది విద్యార్థులు వస్తారని, తను కూడా రావాలని స్నేహితుడు ఫ్లాట్‌కి పిలిచాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కేవలం తను మాత్రమే ఉంది. ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి ఇద్దరు టీచర్లు అత్యాచారం చేసి, వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత అదే ఫ్లాట్‌లో ఆరు నెలల పాటు ఆమెను బంధించి అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెప్పవద్దని, ఒకవేళ చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. బయటకు తెలిస్తే కుటుంబ పరువు ఏమవుతుందని ఆలోచించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని అమ్మాయి ఇంటికి వెళ్లిపోయింది. కానీ ఇటీవల మరో అమ్మాయిని కూడా ఇలానే వేధిస్తున్న వీడియో ఆమెకు కనపడింది. దీంతో ధైర్యం చేసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులైన ఇద్దరు టీచర్లను అరెస్టు చేశారు. అత్యాచారం, అక్రమ నిర్భంధం, నేరపూరిత బెదిరింపు, పోక్సో నేరాల కింద అరెస్ట్ చేసినట్లు కాన్పుర్ పోలీసులు తెలిపారు. Also Read: Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు! #physics teacher misbehavior #rajendranagar #telangana-crime #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి