హైదరాబాద్‌లో కెమిస్ట్రీ లెక్చరర్ ప్రేమ పాఠాలు.. కాలేజీ వద్ద ఆందోళన! హైదరాబాద్‌లో మరో ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలైంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన అతడు విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన మియాపూర్‌లోని మదీనగూడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో జరిగింది. దీంతో స్టూడెంట్ తల్లిదండ్రులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. By Seetha Ram 30 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రస్తుత సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వారితో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. సమాజం పట్ల నీతి నిజాయితీ, గౌరవం వంటి ఎన్నో మంచి బుద్దులు నేర్పించాల్సింది పోయి దారుణానికి పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్! ఇప్పటికే ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగాయి. స్కూళ్లలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఎంతో మంది ఉపాధ్యాయులు కటకటాల పాలయ్యారు. విద్యా బుద్దులు నేర్పించడం మానేసి వారిని అసభ్య పదజాలంతో పిలిచి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నారు. కాదు కూడదని చెప్పిన విద్యార్థినులపై కక్షగట్టి పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నారు. దీంతో విద్యార్థినులు వారి బాధను ఇంట్లో వారికి చెప్పుకోలేక ఎంతో కుమిలిపోతున్నారు. ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ? కెమిస్ట్రీ లెక్చరర్ వేధింపులు అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినికి చదువు చెప్పడం మానేసి ప్రేమ పాఠాలు నేర్పించాడు. ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయాన్ని ఆ స్టూడెంట్ తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే మియాపూర్‌లోని మదీనగూడ శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థినికి ప్రేమ వేధింపులు వచ్చాయి. ఆ కాలేజీ కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ స్టూడెంట్ తన తల్లిదండ్రులకు చెప్పింది. ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా? దీంతో వారు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. #telangana-crime #crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి