తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత ఇదే.. అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంతో సోమవారం ఉదయం 10. 30 కి అసెంబ్లీ సమావేశాలు మొదలైయ్యాయి. తెలంగాణ తల్లి ఏర్పాటుపై సీఎం అంసెబ్లీలో ప్రకటన చేశారు.
అసెంబ్లీ దగ్గర గందరగోళం.. BRS MLAలు అరెస్ట్, ట్రాక్టర్‌పై BJP MLAలు
కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అదానీ రేవంత్ భాయ్.. భాయ్ అని ఉన్న టీ షెర్ట్స్ ధరించి అసెంబ్లీ ఆవరణలోకి వచ్చారు బీఆర్ఎస్ నేతలు. సెక్యురిటి సిబ్బంది వారిని అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు.
అసెంబ్లీలో ఇవి అడగండి.. BRS నేతలకు KCR డైరెక్షన్స్
తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి మొదలవుతుడటంతో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశమైయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఆదివారం MLA, MLCలతో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై డైరెక్షన్స్ ఇచ్చారు.
దానం వివాదాస్పద వ్యాఖ్యలు.. తోలు తీస్తా కొడకల్లారా అంటూ..
ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మూసుకో.. మిమ్ములను బయట కూడా తిరగనియ్య కొడకా.. తోలు తీస్తా.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Telangana Assembly: నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు
ఇవాళ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది రేవంత్ సర్కార్. న్యాయ శాఖకు చెందిన రెండు సవరణ బిల్లులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ అభివృద్ధిపై సభలో స్వల్ప చర్చ జరగనుంది.
Komati Reddy: కేసీఆర్‌కు మా బుల్లెట్ బలంగా దిగింది.. ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే!
మాజీ సీఎం కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రాకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్‌కు తమ బుల్లెట్ బలంగా దిగిందని, ఆయన రాజకీయాలను వదులుకోవడం బెస్ట్ అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదన్నారు.
KCR: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్!
మూడో రోజు శాసనసభ సమావేశాల్లో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారిగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు
Telangana: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా..
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారభం కానుంది. మధ్యహ్నం 12.00 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నరు. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.