తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధికార, విపక్ష నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపకలేపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ మండిపడ్డారు. కోపంతో తన చేతిలో ఉన్న పేపర్‌ను విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
“if they cant run the assembly, i can understand how they are running the govt”
— Sripaad R (@sripaad125) December 19, 2024
akbaruddin owaisi 🤣🤣🤣 pic.twitter.com/QnO7Rj2eDU
ఇక వివరాల్లోకి వెళ్తే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఏ అంశంపై చర్చ చేపడుతున్నారని సమాచారం ఇవ్వాలన్నారు. సభను నడిపే విధానం ఇది కాదంటూ ధ్వజమెత్తారు. ''పార్లమెంటులో కూడ చర్చించాల్సిన అంశాల గురించి ముందుగానే చెబుతారు. ఇక్కడ సభను ఎన్నిరోజులు నడుపుతారో తెలియదు. మీరు అంశంపై మాట్లాడుతున్నారో కూడా తెలియదని'' అక్బరుద్దిన్ మండిపడ్డారు. వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపలేకపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read: రేవంత్‌కు రోజూ పత్తాలు ఆడే అలవాటు.. కేటీఆర్ షాకింగ్ ఆరోపణలు!
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం సభలో ముందుగా ఏ అంశంపై చర్చిస్తున్నారో సమాచారం ఇవ్వాలన్నారు. అయితే స్పీకర్ క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్ చేయడంతో మంత్రి శ్రీధర్ బాబు గట్టిగా అరిచారు. దీంతో అసెంబ్లీలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగి మళ్లీ చర్చ ప్రారంభమైంది.
Also Read: అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం