Oh Bhama Ayyo Rama: సుహాస్ 'గల్లీ స్టెప్' అదిరిపోయింది! చూశారా?
సుహాస్ లేటెస్ట్ మూవీ 'ఓ భామ అయ్యో రామా' నుంచి ఫస్ట్ సాంగ్ 'గల్లీ స్టెప్' లిరికల్ వీడియోను విడుదల చేశారు. మంచి మాస్ బీట్ తో సాగే ఈ పాటలో సుహాస్ అదిరిపోయే స్టెప్పులతో దుమ్ములేపాడు.
సుహాస్ లేటెస్ట్ మూవీ 'ఓ భామ అయ్యో రామా' నుంచి ఫస్ట్ సాంగ్ 'గల్లీ స్టెప్' లిరికల్ వీడియోను విడుదల చేశారు. మంచి మాస్ బీట్ తో సాగే ఈ పాటలో సుహాస్ అదిరిపోయే స్టెప్పులతో దుమ్ములేపాడు.
రామ్ గోదల దర్శకత్వంలో సుహాస్, మాళివిక మనోజ్ జంటగా నటిస్తున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. ఈ సినిమా టీజర్‌ను టీం విడుదల చేసింది. ఇందులో సుహాస్ అమ్మాయిలను నమ్మవద్దని చెబుతున్నాడు. అయితే కామెడీ ఎంటర్టైనర్లో వస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.
హీరో సుహాస్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన ప్రాణ స్నేహితుడు మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు సుహాస్. అసలేమైందో నాకు కరెక్ట్‌గా తెలియదు. కానీ ఇప్పుడు ఇలా ఎంత పని చేశావ్‌రా నా కొడకా అని బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు.
దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. సుహాస్ హీరోగా నటిస్తున్న "ఓ భామ అయ్యో రామ" అనే సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
యంగ్ హీరో సుహాస్ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జనక అయితే గనక" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షితా, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
హీరో సుహాస్, కార్తీక్ రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'శ్రీరంగనీతులు'. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఏప్రిల్ 11న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమవుతోంది.
సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ ను షేర్ చేసింది. మల్లిగాడి మ్యాజికల్ వరల్డ్ కోసం సిద్ధం కండి అంటూ ట్వీట్ చేసింది.
సుహాస్ నటించిన లేటెస్ట్ చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మార్చి 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. మంచి కలెక్షన్లు రాబడుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. పబ్లిసిటీ కూడా కలిసిరావడంతో..బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమా రూ.5.16కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.