/rtv/media/media_files/2025/02/21/S3H31XR0gJNrxoMSz6Ia.jpg)
oh bama ayyo rama movie
Oh Bhama Ayyo Rama: దర్శకుడు హరీష్ శంకర్(Director Harish Shankar) మరోసారి తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో మాత్రమే కనిపించారు.రవితేజ నటించిన "నిప్పు", "నేనింతే" వంటి చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశారు, కానీ తొలిసారి హరీష్ ఓ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read: Pulivendula: పులివెందుల పోలీసులకు కోర్టులో చుక్కెదురు!
సుహాస్ హీరోగా నటిస్తున్న "ఓ భామ అయ్యో రామ" అనే చిత్రంలో హరీష్ శంకర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంలో కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
Also Read: మహా కుంభమేళా చివరి రోజు ఆకాశంలో అద్భుతం!
భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథ..
అయితే హరీష్ శంకర్ నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రామ్ గోధల ఈ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్నారు, ఈ చిత్రం "స్పిరిట్ మీడియా" ద్వారా రానా దగ్గుబాటి విడుదల చేయనున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఒక అందమైన పోస్టర్‌ను విడుదల చేశారు, ఇందులో సుహాస్, మాళవిక మనోజ్ మధ్య రొమాన్స్ కనిపిస్తుంది. భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.
Also Read: మిడిల్ క్లాస్ వారికి చీప్ అండ్ బెస్ట్ స్కూటర్ అంటే ఇదే భయ్యా!
అయితే ఈ చిత్రంలో హరీష్ శంకర్ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా దర్శకులు సినిమాల్లో కేవలం గెస్ట్ రోల్స్ లేదా చిన్న పాత్రలు మాత్రమే చేస్తుంటారు, కానీ ఈసారి హరీష్ ఫుల్ లెన్త్ రోల్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారని సమాచారం. ఇటీవల సంపత్ రాజ్ వంటి దర్శకులు కూడా కొన్ని సినిమాల్లో పాత్రలు పోషించి మెప్పించారు. అయితే హరీష్ శంకర్ ఈ సినిమాకి ప్లస్ అవుతాడో మైనస్ అవుతాడో వేచి చూడాలి.
Also Read: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృతి