జులై 11న విడుదల
రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీ ఆర్ట్స్ బ్యానర్ పై హర్ష నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సుహాస్ జోడీగా మాళవిక మనోజ్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నాయని పావని, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ప్రాజెక్ట్ తో పాటు సుహాస్ మరో మూడు సినిమాలు చేస్తున్నాడు.
కేబుల్ రెడ్డి, ఆనంద్ రావు అడ్వెంచర్స్, ఉప్పు కప్పురంబు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కీర్తిసురేష్- సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఉప్పు కప్పురంబు నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
Also Read: Sardar Ji 3 Controversy: దిల్జిత్ సినిమాలో పాక్ నటి వివాదం.. 'సర్దార్ జీ 3' నిర్మాతలకు 40% నష్టం!