Oh Bhama Ayyo Rama: బాబు అమ్మాయిలను నమ్మవద్దు.. ఓ భామ అయ్యో రామ టీజర్ రిలీజ్

రామ్ గోదల దర్శకత్వంలో సుహాస్, మాళివిక మనోజ్ జంటగా నటిస్తున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. ఈ సినిమా టీజర్‌ను టీం విడుదల చేసింది. ఇందులో సుహాస్ అమ్మాయిలను నమ్మవద్దని చెబుతున్నాడు. అయితే కామెడీ ఎంటర్‌టైనర్‌లో వస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.

New Update

Oh Bhama Ayyo Rama: దర్శకుడు రామ్ గోదల, హీరో సుహాస్ కాంబోలో వస్తున్న సినిమా ఓ భామ అయ్యో రామ. ఈ సినిమాలో మాళివిక మనోజ్ హీరోయిన్‌గా అలరించనుంది. హరీశ్ నల్ల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ అయితే అదిరిపోయింది.

ఇది కూడా చూడండి: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

అమ్మాయిలను నమ్మవద్దని..

సుహాస్ ప్రతీసారి ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సారి కూడా మరో డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నాడు. మన కథ బొమ్మరిల్లు సినిమా కాదు.. రక్తచరిత్ర అంటూ హీరోయిన్‌ చెప్పిన డైలాగ్‌లు నవ్విస్తాయి. చివరకు సుహాస్ బాబు అమ్మాయిలను నమ్మవద్దు.. అని పదే పదే చెబుతుంటారు. టీజర్ చూస్తే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా ఉంది. 

ఇది కూడా చూడండి:USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

మాళవిక అందంతో యువతను కట్టిపడేసింది. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటానని మాళవిక ఇంట్లో చెప్పడం, సుహాస్ భయపడుతూ వెళ్లిపోవడం ఇవన్నీ చూడటానికి కామెడీగానే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. అయితే మూవీ టీం ఇంకా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. 

ఇది కూడా చూడండి:Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

Advertisment
తాజా కథనాలు