Actor Suhas: యాక్టర్ సుహాస్‌కు కొడుకు పుట్టాడోచ్.. ఫొటో చూశారా?

యువ నటుడు సుహాస్ వ్యక్తిగత జీవితంలో మరో శుభవార్త వినిపించారు. సుహాస్-లలిత దంపతులకు తాజాగా రెండోసారి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని హీరో సుహాస్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

New Update
Actor Suhas has been blessed with another baby boy

Actor Suhas has been blessed with another baby boy

యాక్టర్ సుహాస్.. తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ యువ నటుడు సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంలో మరో శుభవార్త అందించాడు. సుహాస్-లలిత దంపతులకు తాజాగా రెండోసారి మగబిడ్డ జన్మించాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ హీరో సుహాస్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఆనందకరమైన వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు సుహాస్‌కు, ఆయన కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 

తండ్రైన యాక్టర్ సుహాస్

ఇదిలా ఉంటే సుహాస్.. కలర్ ఫోటోతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో హీరోగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.చిన్న చిన్న పాత్రలు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ.. చివరికి హీరో స్థాయికి ఎదిగాడు సుహాస్. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే తాను సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి సుహాస్ తరచూ ఇంటర్వ్యూలలో చెబుతుంటాడు. లలితతో తన ప్రేమ వివాహం, ఆమె తన జీవితంలోకి వచ్చాక కలిసొచ్చిన అదృష్టం గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు. 

గతంలో ఈ దంపతులకు తొలి సంతానంగా కూడా మగబిడ్డే జన్మించాడు. ఇప్పుడు రెండోసారి కూడా కొడుకే పుట్టడంతో సుహాస్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సుహాస్ చాలా సినిమాలు చేస్తున్నాడు. అతడి చేతిలో తెలుగు, తమిళంలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కొత్త బిడ్డ రాకతో సుహాస్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నూతన వారసుడి రాకతో సుహాస్ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలని అభిమానులు, సన్నిహితులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు