Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. కాగా ఆ దృశ్యాలు చూసేందుకు శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్నారు పర్యాటకులు.
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. కాగా ఆ దృశ్యాలు చూసేందుకు శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్నారు పర్యాటకులు.
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకలు సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో జలాశయాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు.దీంతో శ్రీశైలం రహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డు స్వీచ్ యార్డు నుంచి 10 కిలోమీటర్లమేర తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో యాత్రికులు రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. యూపాయింట్, డ్యామ్ ,లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది.
శ్రీశైలం ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. క్యూలైన్ ఉద్యోగి మద్యం సేవించి విధుల్లో పాల్గొనడంతో గమనించిన భక్తులు అతడిని చితకబాదారు. అనంతరం ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
AP: ఈరోజు సీఎం చంద్రబాబు శ్రీశైలం లో పర్యటించనున్నారు. భ్రమరాంభ మల్లికార్జునస్వాముల వారిని దర్శించుకోనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం నీటిపారుదల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
శ్రీశైలం జలాశయం సమీపంలో తృటిలో ప్రమాదం తప్పింది. లింగలగట్టు గంగ బ్రిడ్జి కింద కారును ఆపి స్నానాలకు వెళ్లారు వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రయాణికులు. హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో కారు నీటిలో మునిగిపోయింది. గమనించిన ప్రయాణికులు స్థానికుల సహాయంతో కారును నీటిలో నుంచి బయటకు తీశారు.
నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4,09,591 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.
శ్రీశైలంకు వరద క్రమంగా పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైళానికి వరద భారీగా రావడంతో ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. 31,784 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.