Srisailam : శ్రీశైలంలో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తిని గొంతు కోసి.. !

ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో దారుణం చోటు చేసుకుంది. పాతాళగంగ పాతమెట్ల దగ్గర అశోక్ అనే వ్యక్తిని గొంతుకోసి హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

author-image
By Vijaya Nimma
New Update
Mander sword

AP News: నంద్యాల జిల్లా శ్రీశైలంలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. పాతాళగంగ పాతమెట్ల మార్గంలో మద్యం మత్తులో అశోక్ అనే వ్యక్తికి గొంతు కోశారు ఇద్దరు వ్యక్తుల. స్థానికులు సమచారంతో ఘటనా స్థలానికి ఒకటవ పట్టణ పోలీసులు చేరుకున్నారు. మద్యం మత్తులో గొడవ జరిగి అశోక్ అనే వ్యక్తి గొంతుకోసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హుటాహుటిన 108లో సున్నిపెంట ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనతో శ్రీశైలం ప్రజలు ఉలిక్కిపడ్డారు. మరో వైపు అశోక్‌ని హత్య చేసిన ఇద్దరిని  అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read :  ఖమ్మంలో కాలువకు మరోసారి గండి

Advertisment
తాజా కథనాలు