SriSailam-Hyderabad Ghat Road: భారీ వర్షాలు పడడంతో కృష్ణా నది నిండిపోయింది. దీంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారు. డ్యామ్ గేట్లు ఎత్తడంతో అక్కడ సుందర దృశ్యాలను చూసేందుకు యాత్రికులు విపరీతంగా తరలివచ్చారు. వాళ్ళందరూ ఘాట్ రోడ్డులోని పక్కకు వాహనాలు నిలిపడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దాదాపు పదికిలోమీర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం యూపాయింట్, డ్యామ్ , లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు శ్రీశైలం పోలీసులు అవస్థలు పడుతున్నారు. మరవైపు గంటలు, గంటలు ట్రాఫిక్‌లో నిఇచిపోయిన యాత్రికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: శ్రీశైలం –హైదరాబాద్ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్
శ్రీశైలం ఘాట్ రోడ్డు స్వీచ్ యార్డు నుంచి 10 కిలోమీటర్లమేర తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో యాత్రికులు రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. యూపాయింట్, డ్యామ్ ,లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది.
Translate this News: