Raghuveera Reddy : ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన మాట ఏమైంది? జగన్ సర్కార్ పై రఘువీరా ఫైర్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్టును ఖండించారు CWC సభ్యులు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. నిరుద్యోగుల కోసం ఏపీ సెక్రటేరియట్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే అరెస్టు చేస్తారా అంటూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. By Jyoshna Sappogula 22 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి CWC Member Raghuveera Reddy : శ్రీ సత్య సాయి జిల్లా(Sri Satya Sai District) మడకశిర(Madakasira) పట్టణంలో జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి CWC సభ్యులు రఘువీరారెడ్డి(Raghuveera Reddy). ఏపీ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party) అధ్యక్షురాలు షర్మిల రెడ్డి(Sharmila Reddy) అరెస్టును ఖండించారు. నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు ఇప్పించాలంటూ ఏపీ సెక్రటేరియట్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిని అరెస్టు చేస్తారా? అంటూ జగన్ ప్రభూత్వం(Jagan Sarkar) పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. Also Read : వైసీపీకి బిగ్ షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటే పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు నిరుద్యోగులు సెక్రటేరియట్ కు బాంబులు, గడ్డపారులు తీసుకుని వెళ్లలేదు కదా, సహనంతో, సామరస్యంగా వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు కదా.. ఏపీలో అందుకు కూడా స్వేచ్ఛ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నించారు. మాట తప్పను మడమ తిప్పని వారు కదా.. మరి ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన మాట ఏమైంది? అని ప్రశ్నించారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులు అందరికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ(DSC) లో 30 వేల పోస్టులు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు భర్తీ చేయలేదు? నిరుద్యోగులు గొంతు ఎత్తితే అణగదొక్కే చర్యలు తీసుకుంటారా? అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. Also Read : షణ్ముక్ గంజాయి కేసుపై లాయర్ దిలీప్ సుంకర షాకింగ్ పోస్ట్ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను నిలదీసే హక్కు నిరుద్యోగులకు ఉందని తెలియదా అని దుయ్యబట్టారు. బీజేపీ(BJP) ప్రభుత్వంతో కుమ్మక్కై స్కూళ్లను మర్జ్ చేసి ఎన్నో స్కూళ్లు మూసివేశారని ఫైర్ అయ్యారు. విద్యా వ్యవస్థ పైన నిరుద్యోగ యువత పైన దీని ప్రభావం ఎంతగానో పడిందని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఒకటో తేదీన తప్పకుండా జీతాలు తీసుకుంటున్నారు మరి ఏపీలోని ఉద్యోగులకి గత 57 నెలల నుంచి ఒకటో తేదీన జీతాలు వేస్తున్నారా? అని ప్రశ్నించారు. పెన్షన్లనే నమ్ముకున్న రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా మీరు సరైన సమయానికి ఒకటో తేదీకి జీతాలు ఇవ్వడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తేనే ఎన్నికల్లోకి వెళ్లాలని జగన్ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి ప్రస్తుత CWC సభ్యులు రఘువీరారెడ్డి. #andhra-pradesh #cwc #raghuveera-reddy #sri-satya-sai-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి