Ashwani Kumar : అరటిపండు తిని అదరగొట్టాడు..కేకేఆర్ పతనాన్ని శాసించాడు!
అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అశ్వనీ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కు ముందు తాను నిజంగా భయపడ్డానన్నాడు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లుగా వెల్లడించాడు.