Vaibhav Suryavanshi: సూపర్ సెంచరీ ..చరిత్ర సృష్టించిన వైభవ్.. ఒకే ఒక్కడు!

నాలుగో మ్యాచ్‌లో సెంచరీ సాధించి వైభవ్ చరిత్ర సృష్టించాడు.  కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.  తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.  ఈ సెంచరీతో వైభవ్..  యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు.

New Update
vaibhav record

ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై తన ఫామ్‌ను కొనసాగిస్తున్న యంగ్ ఆటగాడు  వైభవ్ నాల్గవ వన్డేలో సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేయడంలో విఫలమైన వైభవ్ ..  మూడో మ్యాచ్‌లో 31 బంతుల్లో 81 పరుగులు చేశాడు.  తాజాగా నాలుగో మ్యాచ్‌లో సెంచరీ సాధించి వైభవ్ చరిత్ర సృష్టించాడు.  కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.  తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.  ఈ సెంచరీతో వైభవ్..  యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. 

Also read :  Sekhar Kammula : స్టార్ హీరోయిన్తో శేఖర్ కమ్ముల పవర్ ఫుల్ మూవీ!

అంతకుముందు, పాకిస్తాన్‌కు చెందిన కమ్రాన్ గులాం ఇంగ్లాండ్‌పై 53 బంతుల్లో సెంచరీ చేశాడు. మూడవ స్థానంలో పాకిస్తాన్‌కు చెందిన ఖాసిం అక్రమ్, శ్రీలంకపై 63 బంతుల్లో ఈ ఘనత సాధించాడు, బంగ్లాదేశ్‌కు చెందిన తమీమ్ ఇక్బాల్ ఇంగ్లాండ్‌పై 68 బంతుల్లో సెంచరీ సాధించాడు. 

Also Read :  Shubman Gill: కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన గిల్.. ఒకటి కాదు రెండుకాదు మొత్తం 5 రికార్డులు

టాస్ గెలిచిన ఇంగ్లాండ్

ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ ఆయుష్ మహాత్రే ఈ మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత, విహాన్ మెల్హోత్రాతో చేతులు కలిపిన సూర్యవంశీ అదరగొట్టాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు గానూ 363 పరుగులు సాధించింది.  వైభవ్ సూర్యవంశీ (143), విహాన్ మల్హోత్రా (129) పరుగులు సాధించారు.  

ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ప్రదర్శనే కనబరిచాడు. 7 ఇన్నింగ్స్‌లలో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో ప్రపంచ రికార్డు సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు.  

Also Read :  విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టిన కెప్టెన్ గిల్

Advertisment
తాజా కథనాలు