BIG BREAKING : గంభీర్ తల్లికి గుండెపోటు.. ఇండియాకు బయలుదేరిన హెడ్ కోచ్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తల్లి సీమా గంభీర్ కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.  విషయం తెలియగానే గంభీర్ ఇంగ్లండ్ నుంచి బయలుదేరాడు.

New Update
gambheer

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తల్లి సీమా గంభీర్ కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతంఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.  వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆమెకు హెల్త్  కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలియగానే గంభీర్ ఇంగ్లండ్ నుంచి బయలుదేరాడు. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది.  జూన్ 13 నుండి జూన్ 16 వరకు టీమిండియా ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కొత్త కెప్టెన్ శుభమాన్ గిల్ కు గంభీర్ కీలకమైన సూచనలు చేయాల్సి ఉంటుంది. ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 20 నుండి హెడింగ్లీలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. 

పూర్తి టెస్ట్ షెడ్యూల్


1వ టెస్ట్ – జూన్ 20, హెడింగ్లీ, లీడ్స్
2వ టెస్ట్ – జూలై 2, ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్ట్ – జూలై 10, లార్డ్స్, లండన్
4వ టెస్ట్ – జూలై 23, ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్ట్ – ఆగస్టు 1, ది ఓవల్, లండన్

Advertisment
Advertisment
తాజా కథనాలు