IND vs ENG : టీమిండియాకు బిగ్ షాక్.. ఓవర్ల కోత.. ఇలా అయితే గెలవడం కష్టమే!

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌ ఐదు రోజు ఆట ప్రారంభం అయింది.  వర్షం కారణంగా దాదాపుగా మ్యాచ్‌ గంటన్నర సేపు ఆలస్యంగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్ లో 10 ఓవర్లు కోత విధించారు. అంటే డేలో 90 ఓవర్లు ఉంటే 80 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు.  

New Update
india match

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌ ఐదు రోజు ఆట ప్రారంభం అయింది.  వర్షం కారణంగా దాదాపుగా మ్యాచ్‌ గంటన్నర సేపు ఆలస్యంగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్ లో 10 ఓవర్లు కోత విధించారు. అంటే డేలో 90 ఓవర్లు ఉంటే 80 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు.  ఈ 80  ఓవర్లలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపుగా కష్టమే.

ఏటు వైపు మలుపు తిరుగుతుందో

ఇక భారత్ ఈ 80 ఓవర్లలోనే ఇంగ్లండ్ ను ఆలౌట్ చేయాలి. లేకపోతే డ్రా గా మ్యాచ్ ముగుస్తుంది.  టెస్టు క్రికెట్ లో పది ఓవర్లు అంటే చాలా కీలకం. మ్యాచ్ ఏటు వైపు అయిన మలుపు తిరగవచ్చు. గెలుపు ఇప్పుడు టీమ్ ఇండియా వైపే ఉండటం.. ఓవర్ల కోత పడటం టీమ్ కు  మైనస్ గా చెప్పుకో వచ్చు. ఆకాశ్ దీప్, సిరాజ్ లపైనే జట్టు భారం వేసింది. వార్త రాసే సమయానికి 5 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 83 పరుగులు చేసింది. మరి ఈ మ్యాచ్ ఏటు వైపు మలుపు తిరుగుతుందో చూడాలి.  

ఇప్పటికే ఈ సిరీస్ లో ఇంగ్లండ్ ఫస్ట్ టెస్టులో గెలిచి ముందంజలో ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ డ్రా అయితే మరో టెస్టులో టీమిండియా కష్టపడక తప్పదు.  

Advertisment
తాజా కథనాలు