IND vs ENG : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బ్యాటింగ్!

ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. హెడింగ్లీ వేదికగా తొలి మ్యాచ్ మొదలు కాగా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.  

New Update
ind-vs-eng 1st test

ఇంగ్లండ్, ఇండియా జట్ల మధ్య  ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ప్రారంభమైంది. లీడ్స్‌ వేదికగా తొలి మ్యాచ్ మొదలు కాగా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.   దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. శుభ్‌మన్‌ గిల్ నేతృత్వంలోని టీమిండియా రోహిత్, విరాట్, అశ్విన్ లాంటి దిగ్గజాలు లేకుండానే బరిలోకి దిగింది.  

ఈ మ్యాచ్ తో సాయి సుదర్శన్ టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.  భారత టెస్ట్ దిగ్గజం చతేశ్వర్ పుజారా ఈ 23 ఏళ్ల యువ క్రికెటర్ కు  తన చేతుల మీదుగా టెస్ట్ క్యాప్‌ను అందించాడు. IPL 2025లో సుదర్శన్ బ్యాటింగ్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.  గుజరాత్ టైటాన్స్ తరపున 759 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు - ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 

Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

Also Read :  ఎమ్మెల్యే Vs మేయర్.. కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ

Also Read :  జగన్ రప్పా.. రప్పా.. డైలాగ్ కు పవన్ కౌంటర్.. ఏమన్నారంటే?

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

Also Read :  పాకిస్తాన్ భూజాలపై తుపాకి పెట్టి ఇరాన్‌కి దెబ్బ.. దిమ్మతిరిగిపోయే ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఇదే!

 

ind-vs-eng | england | sports

Advertisment
Advertisment
తాజా కథనాలు