Russian Scientist: ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రష్యా.. లిఫ్ట్‌లో అంతరిక్షంలోకి!
రాకెట్ సహాయం లేకుండా అంతరిక్షానికి ప్రయానిద్దామని రష్యా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భూమిపై 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ఉండే ఓ ఉపగ్రహం భారీ కేబుల్‌ను స్థిరంగా పట్టుకొని ఉంచుతుంది. దాంతో ఎక్సలేటర్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారు.
Sunita Williams: భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్.. టైమ్ చెప్పిన నాసా
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు.
Trump: ఆ నిర్ణయాల్లో మస్క్ జోక్యం ఉండందంటున్న పెద్దన్న!
డొనాల్డ్ ట్రంప్ ..తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అంతరిక్షానికి సంబంధించిన వ్యవహారాల్లో మస్క్ జోక్యం ఉండదని ఆయన స్పష్టంచేశారు.
Sunita Williams: అంతరిక్షంలో సరికొత్త రికార్డు సృష్టించిన సునీతా విలియమ్స్
అంతరిక్షంలో ఎక్కువ సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా సనీతా విలియమ్స్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. తాజాగా చేసిన 9వ స్పేస్‌వాక్‌తో కలిపి సునీతా.. 62 గంటల 6 నిమిషాలు పూర్తి చేశారు. అలాగే స్పేస్‌వాక్ టాప్ 10 జాబితాలో ఆమె 4వ స్థానానికి చేరారు.
USA: బైడెన్ వదిలేయమన్నారు..ట్రంప్ తొందరగా తీసుకురమ్మన్నారు..వ్యోమగాములపై మస్క్
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను తీసుకురావడం బైడెన్ ప్రభుత్వం వల్లనే ఆలస్యం అయిందని అంటున్నారు ఎలాన్ మస్క్. కొత్త అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వ్యోమగాములను తొందరగా తీసుకురావాలని చెప్పారని మస్క్ తెలిపారు.
Sunita Williams: నడక మర్చిపోయాను, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా: సునితా విలియమ్స్
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్ తాజాగా అక్కడి నుంచి విద్యార్థులతో మాట్లాడారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడం చాలా కష్టమని తెలిపారు. నడక ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాని చెప్పారు.
భూమివైపే దూసుకొస్తున్న పవర్ఫుల్ బ్లాక్ హోల్.. ప్రళమేనా?
విశ్వంలో పెద్ద బ్లాక్ హోల్ భూమివైపే దూసుకొస్తుంది. 700 మిలియన్ల సూర్యుని ద్రవ్యరాశితో J0410-0139 అనే బ్లాక్ హోల్(చనిపోయిన నక్షత్రం) భూమికి 12.9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. NASAలోని చంద్ర అబ్జర్వేటరీ, చిలీలోని వెరీ లార్జ్ టెలిస్కోప్‌తో దీన్ని గుర్తించారు.
ISRO: ఇస్రో మరో ఘన ... అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో చెప్పింది.