Sunita Williams: అంతరిక్షంలో సరికొత్త రికార్డు సృష్టించిన సునీతా విలియమ్స్‌

అంతరిక్షంలో ఎక్కువ సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా సనీతా విలియమ్స్‌ సరికొత్త రికార్డ్ సృష్టించారు. తాజాగా చేసిన 9వ స్పేస్‌వాక్‌తో కలిపి సునీతా.. 62 గంటల 6 నిమిషాలు పూర్తి చేశారు. అలాగే స్పేస్‌వాక్‌ టాప్ 10 జాబితాలో ఆమె 4వ స్థానానికి చేరారు.

New Update
Sunita Williams

Sunita Williams

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సంచలనం సృష్టించారు. అంతరిక్షంలో ఎక్కువ సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న ఆమె (ISS).. తన 9వ స్పేస్‌వాక్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కువ సేపు అంతరిక్షంలో నడిచిన రికార్డుతో నాసా ఆల్‌టైం లిస్ట్‌లో స్థానం సంపాదించారు.  

Also Read: అలా చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తా.. ట్రంప్ హెచ్చరిక

ఇక వివరాల్లోకి వెళ్తే.. సునీతా విలియమ్స్‌ మరో సహచర ఆస్ట్రోనాట్‌ విల్‌మోర్‌తో కలిసి గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్ చేశారు. తాజాగా చేసిన స్పేస్‌వాక్‌తో కలిపి సునితా విలియమ్స్ 62 గంటల 6 నిమిషాల పాటు పూర్తి చేశారు. దీంతో నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ వైట్‌సన్‌ స్పేస్‌వాక్‌ 60 గంటల రికార్డును ఆమె బ్రేక్ చేశారు. అలాగే స్పేస్‌వాక్‌ టాప్ 10 జాబితాలో కూడా సునీతా నాలుగో స్థానానికి చేరారు. 

ఇదిలాఉండగా.. అత్యధిక గంటలు స్పేస్‌ వాక్ చేసిన వారిలో రష్యాకు చెందిన కాస్మోనాట్‌ అనాటోలీ సోలోవ్‌యెవ్ ఉన్నారు. ఈయన 16 సార్లు స్పేస్‌వాక్ చేశారు. మొత్తం 82 గంటల 22 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ చేసిన వ్యోమగామిగా మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో నాసా వ్యోమగాములు ఉన్నారు. టాప్‌ 10 జాబితాలో ఎనిమిది మంది నాసా ఆస్ట్రోనాట్సే ఉన్నారు. అయితే వారం వ్యవధిలోనే సునీతా విలియమ్స్‌ రెండుసార్ల స్పేస్‌వాక్ చేశారు. సనీత, విల్‌మోర్‌లు అంతరిక్ష కేంద్రం బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా ? అనేది పరిశీలించారు. 

Also Read: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

భూమికి 420 కిలోమీటర్ల పైన స్పెయిన్‌ దేశం పైభాగాన వాళ్లు స్పేస్‌వాక్ చేశారు.   ఇదిలాఉండగా గతేడాది జూన్‌లో ఈ ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. వీళ్లు వారంలో తిరిగిరావాల్సి ఉండగా.. వారు వచ్చిన వ్యోమనౌకలో టెక్నికల్ సమస్య వల్ల అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఈ ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో వాళ్లిద్దరిని భూమిపైకే తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.       

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు