/rtv/media/media_files/2025/10/04/a-dinner-with-101-dishes-for-the-son-in-law-2025-10-04-18-31-37.jpg)
A dinner with 101 dishes for the son-in-law
Dasara Festival: తెలంగాణలో దసరా పండుగ అంటే అతి పెద్ద పండుగ. ఇక కొత్త అల్లుళ్లకైతే తొలి పండుగ మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. అల్లుళ్లకు మర్యాద చేయడంలో గోదారొళ్ల స్టైలే వేరు. కానీ, ఇప్పుడు ఈ ట్రెండ్ తెలంగాణకు కూడా పాకింది. కొత్త అల్లుడు పండుగకి ఇంటికి వస్తే.. రకరకాల వంటకాలతో విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణలో ఈ దసరా పండగకు విందు భోజనంతో పాటు తులం బంగారం కూడా దక్కించుకున్నాడు ఓ అల్లుడు. అదేలా అంటే.. దసరా పండుగకు కొత్త అల్లుడు ఇంటికొస్తున్నాడని.. అతడికి విందు ఏర్పాటు చేశారు ఆ అత్తామామలు. దసరా పండుగకు అత్తారింటికి వచ్చిన కూతురు, అల్లుడు కోసం ఏకంగా 101 రకాల ఆహారపదార్థాలతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. ఇది చూసి ఆ అల్లుడు ఆశ్చర్యపోయాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. అల్లుడు చేసిన చాలెంజ్‌లో అత్తామామలు ఓడిపోవడంతో.. అతడు తులం బంగారం గెల్చుకునే అవకాశం లభించింది. ఇంతకు అసలు ఏం జరిగిందో తెలియాలంటే.. ఇది పూర్తిగా చదవాల్సిందే.
తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025
ఒక్క వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్న అల్లుడు
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో తన కూతురు సింధుకు, నికిత్ అనే అబ్బాయికి ఇచ్చి 2 నెలల క్రితం పెళ్లి చేసిన గుంత సురేష్, సహన దంపతులు
పెళ్లి తర్వాత… pic.twitter.com/l1zlHMtWBB
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధికి చెందిన గుంత సురేశ్, సహనల కూతురు సింధు పెళ్లి రెండు నెలల కిందట తిరుపతిలో జరిపించారు. వారి వివాహమైన తర్వాత వచ్చిన తొలి పండుగ దసరా కావడంతో అల్లుని ఇంటికి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు వరంగల్ నుంచి పండుగకు అల్లుడు నిఖిత్ అత్తారింటికి వచ్చాడు. దీంతో కొత్త అల్లుడి కోసం వారు భారీ విందును ఏర్పాటు చేశారు. ఒక పెద్ద అరటి ఆకులో101 వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ భోజనంలో తెలంగాణకు చెందిన 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, పాయసాలు, కూరలు, వేపుడు వంటలు,అన్నంతో కలిపి భోజనాన్ని వడ్డించారు.
అయితే, ఇక్కడే ఒక గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది. విస్తరిలో 101 వంటకాలు వడ్డించామని అత్తామామలు చెప్పంగా అల్లుడు సరదాగా101లో ఒక్కటి తగ్గినా ఏమిస్తారని అత్తా-మామల్ని అడిగాడు. వారు కూడా అంతే సరదాగా101 రకాలకు ఒక్కటి తగ్గినా.. తులం బంగారం పెడతామని వారు సవాల్ చేశారు. దీంతో ఆ అల్లుడు పోటీ పడి మరి.. ఒకటికి రెండుసార్లు లెక్కపెట్టాడు. అల్లుడు కూడా అంతే చురుకుగా అన్ని వంటకాలను లెక్కపెట్టాడు. లెక్కేసి చూసేసరికి ఒక వంటకం నిజంగానే మిస్సయింది! వెంటనే స్పందించిన అత్తమామలు మాట నిలబెట్టుకున్నారు. వెంటనే అల్లునికి ఒక తులం బంగారం ఇచ్చారు. ఈ సంఘటన కుటుంబంలోనే కాదు, పట్టణమంతా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ఆ నోట ఈ నోట తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. దీంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. లక్కంటే నీదే బ్రో.. విందుతో పాటు బంగారం కూడా సంపాదించుకున్నావ్.. కొత్త పండగకు కొత్త అల్లుడు లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.. విందు హైలెట్.. గోల్డ్ గెలవడం ఇంకా హైలెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సరా వచ్చిందయ్యా..బహుమతి ఇచ్చిందయ్యా అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం!