Success Stories: 'రిస్క్ తీసుకోకపోతే జీవితంలో మిగిలేది రస్క్ మాత్రమే' ఈ డైలాగ్ నిజమని ప్రూవ్ చేసారు ఓ సాఫ్ట్‌వేర్ జంట. ఈరోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, డాక్టర్లకు ఉన్న డిమాండ్ తెలిసిందే. కానీ కొంత మంది ఉద్యోగాలలో ఎక్కువ జీతం వస్తున్నా జాబ్ మానేసి సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. చిన్నదైనా సొంత బిజినెస్ లో ఉండే కిక్ వేరొకరి కింద ఎంత డబ్బులకి పనిచేసినా రాదని యువత భావించటమే దీనికి కారణం. Also Read : అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..! ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏపీకి చెందిన భార్యాభర్తల సక్సెస్ స్టోరీ గురించి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోటినాగ మణికంఠ, నాగ వెంకట దుర్గా పావని ఇద్దరూ బీటెక్ గ్రాడ్యుయేట్స్. మొదట వారు ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేశారు. కానీ ఐటీ ఉద్యోగం వల్ల తమతోటి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు చూసి, సొంత వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. గుంటూరులో 'శ్రేష్ఠే' అనే ఆర్గానిక్ ఫార్మింగ్ వెంచర్‌ను స్టార్ట్ చేసారు. Also Read : రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలకు అందించాలనే లక్ష్యంతో, సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో శిక్షణ తీసుకున్నారు. రూ.17 లక్షలతో ఈ వ్యాపారం ప్రారంభించి, మొదట తాము పండించే ఆర్గానిక్ ఉత్పత్తులను సమీప వినియోగదారులకు డెలివరీ చేసేవారు. Also Read : 'పుష్ప2' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? అక్షరాలా రూ.90 లక్షల సంపాదన.. 2019లో తమ తొలి ఫిజికల్ స్టోర్ ప్రారంభించారు. తరువాత అనేక మంది రైతులతో కలిసి 160 కి పైగా ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసారు, ఈ జంట ప్రస్తుతానికి సంవత్సరంలో రూ.90 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నారు. Also Read : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..!