Sigachi: పాశమైలారం ఘటన.. 41కి చేరిన మృతుల సంఖ్య.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
పాశమైలారం సిగాచీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 40 మంది మృత్యువాత పడగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ జితెందర్ అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది.