/rtv/media/media_files/2025/07/02/pashamilaram-incident-2025-07-02-19-47-41.jpg)
Pashamilaram
Pasha Mailaram : పాశమైలారం సిగాచీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 40 మంది మృత్యువాత పడగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ జితెందర్ అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. ఇదిలా ఉండగా సిగాచీ ప్రమాద ఘటనలో మరో మృతదేహం వివరాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గల్లంతైన తొమ్మిది మంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. ఈ పరిణామం బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Also Read: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!
పలువురి జాడ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు తమ వారి మృతదేహాల కోసం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆసుపత్రిలో ఉన్న 9 మంది క్షతగాత్రుల్లో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా.. మిగిలిన ఆరుగురిలో 40 నుంచి 80 శాతానికి పైగా కాలిన గాయాలైన ముగ్గురికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!