/rtv/media/media_files/2025/07/03/hyd-fire-accident-2025-07-03-07-44-51.jpg)
Sigachi company blast
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో 44 మంది మరణించిన విషయం తెలిసిందే. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో మరో 13 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మరో 8 మంది కార్మికులు ఆచూకీ లభించలేదు. అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు రెస్క్యూ సహా శిథిలాల కింద దొరికిన మాంసపు ముద్దలతో.. కనిపించకుండ పోయిన వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏ (DNA) లను టెస్ట్ చేశారు.
Also Read: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్
Pashamilaram Sigachi Incident
అయినా 8 మంది జాడ తెలియలేదు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రియాక్టర్ పేలిన సమయంలో దానికి దగ్గరగా ఉన్నవారు, మంటలు అధికంగా వ్యాప్తి చెందడం వల్ల కాలి బూడిదై ఉంటారని అధికారులు తుది నిర్ణయానికి వచ్చారు. దీంతో ప్రమాదంలో కనిపించకుండా పోయిన రాహుల్, శివాజి, వెంకటేశ్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్‌ల జాడ తెలియనట్లేనని అధికారులు ధృవీకరించారు. వారంతా కాలి బూడిదై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమాచారాన్ని కనిపించకుండా పోయిన 8 మంది కుటుంబ సభ్యులకు చెప్పారు.
Also read: డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ: కేటీఆర్ విమర్శలు
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఫ్యాక్టరీ వద్దే పడిగాపులు కాస్తున్న వారిని ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో తమ వారి ఆచూకీ లభించదనే చేదు వార్త వారిని దుంఖసాగరంలో ముంచివేసింది. అక్కడి బూడిదను తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకునేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ ఘటనలో ఇప్పటికే 44 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే 8 మంది అచూకీ కూడా లభించనట్లయితే మరణించిన వారి సంఖ్య 52గా భావించాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో కార్మికులు మృతి చెందటం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:భారీ వరదలు.. అతలాకుతలంగా మారిన అమెరికాలోని టెక్సాస్
ఇక ఫ్యాక్టరీలో రెస్య్యూ చర్యలు ముగిసి, తిరిగి పూర్వస్థితికి రావడానికి 3 నెలల కాలం పట్టే అవకాశం ఉంది. దీంతో పరిశ్రమలో పనిచేసే కార్మికులను వారివారి స్వంత స్థలాలకు వెళ్లిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. 3 నెలల తర్వాత తిరిగి వచ్చి విధుల్లో చేరాలని చూచిస్తున్నారు. కాగా, తమవారిని కోల్పొయిన పలువురు కన్నీటితో తమ స్వంత స్థలాలకు ప్రయాణమవుతున్నారు.
Also Read: పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్
కాగా, సిగాచీ ఫార్మా ఫ్యాక్టరీని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) అధికారుల బృందం సందర్శించింది. ప్రమాద స్థలంలో అణువణువు పరిశీలిస్తూ ఘటన వివరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లా అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రమాదం తీరును బృందం సభ్యులకు వివరించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్
sigachi chemical factory | sigachi company blast | Sigachi Chemical Explosion | Sigachi Chemical | hyderabad sigachi chemical factory | Pashamailaram | Pashamylaram Fire Accident