/rtv/media/media_files/2026/02/20/siddipet-2026-02-20-18-15-25.jpg)
Congress leader murdered in siddipet
Crime : సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధి చెల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనను రాజక్క పేట గ్రామ శివారులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
బాల్ రెడ్డి పై దాడి చేసి హత్య చేయడంతో పాత కక్ష్యలు ఏమన్నా ఉన్నాయా; లేక భూ తగాదాలు కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. బాల్ రెడ్డికి ఎవరైన శత్రువులు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన విషయం స్థానికులకు తెలవడంతో పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన విధానాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాల్ రెడ్డి హత్య దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా బాల్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన దాయాదులు భూ తగాదాల నేపథ్యంలో దారుణంగా గొంతు కోసి చంపినట్లు ప్రచారం సాగుతోంది. కాగా నిందితులు అయిన తల్లి, కొడుకు పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది.. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు.
Follow Us