/rtv/media/media_files/2025/02/28/vAI7ABTtvVBQcN0pbhwb.jpg)
Jagan, Sharmila, Ys Vijayamma
సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పవర్ లో వాటాలన్ని తన పేరిట బదిలీ అయ్యాయని చెప్పారు. ఇందులో జగన్ కు కానీ, భారతీరెడ్డికి కానీ వాటాల్లేవని చెప్పారు. ఇద్దరూ కలిసి ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్‌కు వైఎస్ విజయమ్మ తెలిపారు. సరస్వతీ లిమిటెడ్ తో కానీ, గిఫ్ట్ డీడ్ తో కానీ రష్మిలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. జగన్‌కు, షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాలను ఇక్కడ తీసుకురావడం ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించడానికేనన్నారు.
నిస్సహాయంగా కోర్టులో నిలబెట్టారు..
జగన్, షర్మిల ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని విజయమ్మ వాపోయారు. సరస్వతి వాటాలపై హక్కులన్నీ తనవేనని స్పష్టం చేశారు. పిల్లల మధ్య వివాదంలో ఏ తల్లీ కోరుకోని విధంగా తాను కోర్టులో నిలబడాల్సి వచ్చిందని...ఇలాంటి నిస్సహాయ స్థితి ఎవరికీ రాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితోనైనా దీన్ని వదిలేస్తే బావుంటుందని అన్నారు. సరస్వతి వాటాల కొనుగోలు, గిఫ్ట్‌డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్టప్రకారం తన పేరిట బదలాయించారని విజయమ్మ చెప్పారు. షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం గిఫ్ట్‌డీడ్‌ను తనపై విశ్వాసంతో చేసి ఇచ్చాననడం అబద్ధమని చెప్పారు. దీనిపై జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావని, భారీ జరిమానాతో కొట్టేయాలని విజయమ్మ కోరారు.
వ్యక్తిగత, రాజకీయ వివాదాలు...
వ్యక్తిగత, రాజకీయ వివాదాలతో పటిషన్ దాఖలు చేశారని విజయమ్మ అన్నారు. దీనిలో సెక్షన్ 59ను తప్పుగా అన్వయిస్తున్నారని చెప్పారు. జగన్, భారతీలకు సరస్వతి పవర్ లో ఉన్న వాటాలన్నీ తన పేరు బదిలీ అయిపోయాయని...ప్రస్తుతం వారికి ఏమీ లేవని తెలిపారు. జగన్, షర్మిల మధ్య విభేదాలు తన హక్కులపై ప్రభావం చూపవని చెప్పారు. గిఫ్ట్‌డీడ్‌లో షర్మిల ప్రయోజనాల కోసం అంటూ ఎలాంటి షరతులు లేవని, అవాస్తవాలతో ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సరస్వతిలోని 46.71 లక్షల వాటాలను సండూర్ కంపెనీ, 71.50 లక్షల వాటాలను క్లాసిక్ రియాల్టీ తనకు విక్రయించిందని..దీంతో మొత్తం 1.21 కోట్ల ఈక్విటీ వాటాలతో 48.99% తాను దక్కించుకున్నానన్నారు. 2021 జులై 26న జగన్, భారతి రెండు గిఫ్ట్‌డీడ్ తనకు చేసి ఇచ్చారన్నారు. వీటి ప్రకారం సరస్వతిలో జగన్‌కు చెందిన 74.26లక్షల వాటాలు, భారతికి చెందిన 40.50 లక్షల వాటాలను తనకు బదిలీచేసినట్లు తెలిపారు. దీనిని జూలై 2న బోర్డు సమావేశంలో ఉంచగా అందులో డైరెక్టర్లుఅందరూ బదలాయింపుకు ఆమోదం తెలిపారని స్పష్టం చేశారు. దీంతో కంపెనీ సభ్యుల జాబితాలో తన పేరు నమోదయిందని చెప్పారు.ప్రస్తుతం తాను సరస్వతి పవర్ కంపెనీలో 99.75 శాతం వాట పొందానని చెప్పారు.
Also Read: Business: భారీ నష్టాలతో దేశీ స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్