Breaking: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్ట్..!
హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. థియేటర్ యజమానితో పాటు సెక్యూరిటీ గార్డ్, మేనేజర్ ని అరెస్ట్ చేశారు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే రేవతి మృతి చెందినట్లు తెలిపారు.
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి హామీ ఇస్తూ..
సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. తన వంతుగా రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
శ్రీతేజ్ కుటుంబానికి అండగా 'పుష్ప2' టీమ్.. హాస్పిటల్ వెళ్లిన బన్నీ
'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్న శ్రీతేజ్ ను బన్నీటీం, మైత్రీ మూవీ మేకర్స్ పరామర్శించారు. వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు.
Allu Arjun: అల్లు అర్జున్‌కు ఊహించని షాక్!
TG: అల్లు అర్జున్‌పై హుస్నాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల 4న ఎలాంటి అనుమతులు లేకుండాసంధ్య థియేటర్‌కు రావడం వల్ల ఓ మహిళా ప్రాణం పోయిందని.. ఆమె మృతికి కారణమైన అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయాలని హుస్నాబాద్ బీఎస్పీ ఇంఛార్జి రవీందర్ ఫిర్యాదు చేశారు.
పుష్ప-2 ఎఫెక్ట్.. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు
తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పుష్ప-2 మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట...అల్లు అర్జున్ టీమ్‌పై కేసు
సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదయ్యింది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసు నమోదయ్యింది.
'పుష్ప2' ప్రీమియర్ లో మహిళ మృతి.. రెస్పాండ్ అయిన అల్లు అర్జున్ టీమ్
'పుష్ప2' సినిమా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిస లాట ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ' నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం..' అని తెలిపింది.