Pushpa 2: అల్లు అర్జున్ 'పుష్ప2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. అల్లు అర్జున్ కూడా సినిమా చూసేందుకు అదే థియేటర్ కి రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
Also Read: ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా!
తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్టు..
అయితే తాజాగా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్ యజమానితో పాటు, సెక్యూరిటీ గార్డ్, మేనేజర్ ని అదుపులోకి తీసుకున్నారు. సరైన భద్రత చర్యలు చేపట్టకపోవడం, నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమని తెలిపారు.
ఇలా ఇలా ఉంటే ఇప్పటికే అల్లు అర్జున్ ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన.. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. " మేము పుష్ప2’ ప్రీమియర్ షోకి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లాం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలినట్లు మర్నాడు ఉదయం తెలుసుకున్నాం. ఈ ఘటనలో ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయారని తెలియగానే మా చిత్ర బృందమంతా దిగ్భ్రాంతికి గురయ్యింది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటమనేది గత 20ఏళ్లుగా నాకు ఆనవాయితీగా వస్తోంది.
కానీ, ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి విషాద ఘటన జరగడం బాధగా ఉంది. రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మేము ఎంత చేసినా ఆమె లేని లోటు తీర్చలేనిది. నా తరఫున వారి కుటుంబానికి రూ.25లక్షలు సాయం అందివ్వాలని నిర్ణయించుకున్నా. ఆ కుటుంబానికి నా తరఫున ఇంకెలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉంటా.." అని వీడియోలో పేర్కొన్నాడు.
Also Read: ఒకరేమో సూపర్ హిట్ అంటున్నారు.. మరొకరేమో అట్టర్ ఫ్లాప్..ట్విట్టర్ లో 'పుష్ప' రచ్చ